షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా పనికి రాడు: పాక్ మాజీ ప్లేయర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని గొప్ప పేస్ బౌలర్లలో ఇండియాకు చెందిన జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ షాహీన్ అఫ్రిది ముందుంటారు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఈ ఇద్దరూ సిద్ధహస్తులే.. గతేడాది ఆసియా కప్ తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. బుమ్రా సేవలను టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎంతగానో మిస్ అయింది.
బుమ్రా 30 టెస్టుల్లో 128 వికెట్లు తీశాడు. 60 టీ20ల్లో 70 వికెట్లు పడగొట్టాడు.
మరోవైపు షాహీన్ ఆఫ్రిది 25 టెస్టుల్లో 99 వికెట్లు పడగొట్టాడు. 32 వన్డేల్లో 62 వికెట్లు, 47 టీ20ల్లో 58 వికెట్లు పడగొట్టాడు.
వికెట్లు సులభంగా తీసే బుమ్రాపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బుమ్రా
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడనున్న బుమ్రా..!
బుమ్రా కంటే షాహీన్ అఫ్రిది చాలా చాలా మెరుగైన బౌలర్ అని, షాహీన్ స్థాయికి బుమ్రా దరిదాపుల్లో రాడని పాకిస్థాన్ ఆల్ రౌండర్ రజాక్ పేర్కొన్నారు.
ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఆడతాడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ నెట్స్‌లో బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో మళ్లీ పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయని టీమిండియా అభిమానులు అశిస్తున్నారు.