ఇండోర్‌లో రోహిత్ విశ్వరూపం, రికి పాంటింగ్ రికార్డు సమం చేసిన హిట్ మ్యాన్
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వన్డేల్లో అరుదైన రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించి వన్డేల్లో 30వ సెంచరీని నమోదు చేశాడు. 2020 తర్వాత వన్డేలో సెంచరీ చేసి తన ఫామ్‌ని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వన్డేలో శతకాల పరంగా ఆస్ట్రేలియా లెజెండ్ ప్లేయర్ రికి పాంటింగ్ రికార్డును సమం చేశాడు. రోహిత్ వన్డేలో ప్రస్తుతం 30 సెంచరీలు సాధించాడు. పాంటింగ్ తర్వాత అత్యధికంగా సెంచరీలు చేసి మూడో స్థానంలో నిలిచి, చరిత్రకెక్కాడు. సచిన్ టెండూల్కర్ (49), విరాట్ కోహ్లీ (46) తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు. రోహిత్ చివరిసారిగా జనవరి 2020లో బెంగుళూరులో ఆస్ట్రేలియాపై 128 బంతుల్లో 119 పరుగులతో వన్డే శతకం సాధించాడు.
విమర్శకుల నోరు మూయించిన రోహిత్‌శర్మ
టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ టాలెండెట్ బ్యాట్స్‌మెన్. గతేడాది టెస్టులకు శాశ్వత కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ప్రస్తుతం వన్డే సెంచరీ సాధించి విమర్శకుల నోర్లను రోహిత్ మూయించాడు. న్యూజిలాండ్‌తో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మెన్ గిల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. రోహిత్, గిల్ ఇప్పటి వరకు ఆరుసార్లు 50+ స్కోర్ చేశారు. వాళ్లు వరుసగా 143, 33, 95, 60, 72, 150* చేశారు. రోహిత్ 83 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇప్పటి వరకూ శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య 270 సిక్స్ లు బాదగా.. దాన్ని రోహిత్ శర్మ అధిగమించాడు.