Page Loader
టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం
టీమిండియా ప్లేయర్ జస్పిత్ బుమ్రా

టీమిండియా షాక్.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2023
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రాను ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్టులకు బుమ్రా తప్పుకున్నాడు. ఈ పేసర్‌కు మరో మూడు వారాల విశ్రాంతి పొడిగించినట్లు సమాచారం. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ కనీసం 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలి కనీసం మూడు వారాల పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండాలని బుమ్రాకు వైద్యులు సూచించారు. బుమ్రా తన చివరి మ్యాచ్ ను సెప్టెంబర్ 2022 లో ఆడాడు.

టీమిండియా

బుమ్రా లేకపోవడం భారత్‌కు ఇబ్బందే

జనవరి 2018లో బుమ్రా టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 30 మ్యాచ్లో 21.99 సగటుతో 128 వికెట్లు పడగొట్టి.. సత్తా చాటాడు. స్వదేశంలో, కేవలం నాలుగు టెస్టులు ఆడి, 14 వికెట్లు తీశాడు. వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్న బుమ్రాకు మరికొంతకాలం విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించింది. బుమ్రా లేకపోవడం భారత్ ఇబ్బంది అని చెప్పొచ్చు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు దశాబ్ద కాలంగా స్వదేశంలో జరిగిన టెస్టుల్లో భారత్‌ తరఫున కీలక వికెట్లు పడగొట్టారు. పేస్-బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్ ఉన్నారు.