LOADING...
Hardik Pandya: హార్దిక్ పాండ్యతో డేటింగ్ రూమర్లపై ఇషా గుప్తా స్పందన!

Hardik Pandya: హార్దిక్ పాండ్యతో డేటింగ్ రూమర్లపై ఇషా గుప్తా స్పందన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya)తో డేటింగ్‌లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం వచ్చిన రూమర్లపై నటి ఇషా గుప్తా (Esha Gupta) ఎట్టకేలకు స్పందించారు. కొంతకాలం తమ మధ్య స్నేహం ఉన్నప్పటికీ డేటింగ్‌ దశలోకి వెళ్లకుండానే అంతా ముగిసిపోయినట్టు ఆమె తెలిపారు. కొన్ని నెలల పాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆ సమయంలో మాకో మంచి స్నేహం ఏర్పడింది. డేటింగ్‌లో ఉన్నామని నేను అనుకోవడం లేదు. మాకున్న స్నేహం డేటింగ్‌ దశలోకి వెళ్తుందా లేదా అనేది అప్పటికే నిర్ణయించకుండానే మేమిద్దరం విడిపోయాము. రెండు, మూడుసార్లు మాత్రమే కలిసాము.

Details

విమర్శలు నన్నెంతో బాధించాయి

కొన్ని నెలల పాటు మాకున్న అనుబంధం కొనసాగింది. తరువాత అది ముగిసిపోయిందని ఇషా గుప్తా తెలిపారు. 'కాఫీ విత్ కరణ్' షోలో మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్య తీవ్ర విమర్శలు ఎదుర్కొవడంపైనా ఇషా స్పందించారు. ఆ విమర్శలు నన్నెంతమాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే అప్పటికే మేమిద్దరం విడిపోయామని అన్నారు.

Details

సాజిద్ ఖాన్‌తో ఘర్షణపై ఇషా గుప్తా స్పందన 

దర్శకుడు సాజిద్ ఖాన్‌తో 'హమ్‌షకల్స్' షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న మనస్పర్థల గురించీ ఇషా గుప్తా వెల్లడించారు. "సాజిద్‌ రూపొందించిన 'హమ్‌షకల్స్‌'లో నటించాను. షూటింగ్ సమయంలో మాకొకసారి గొడవ జరిగింది. తర్వాత సెట్‌లో పరిస్థితులు మారిపోయాయి. నన్నెవరైనా తక్కువ చేసి అసభ్యంగా మాట్లాడితే నేను ఊరుకోను. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడమే మంచిది. ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేనూ అదే రీతిలో సమాధానం ఇచ్చాను. ఒకరోజు సెట్‌ నుంచి ఇంటికి వెళ్లిపోయాను. సినిమా కూడా వదిలేయాలని అనుకున్నా. అప్పుడు చిత్ర నిర్మాత క్షమాపణలు చెప్పారు.

Advertisement

Details

వీడెవడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఇషా గుప్త

ఆ తర్వాత సాజిద్‌ కూడా 'సారీ' చెప్పాడు. దాంతో నేను సినిమా పూర్తి చేశానని వివరించారు. 'మీటూ' ఉద్యమ సమయంలో సాజిద్‌ ఖాన్‌పై పలువురు నటీమణులు ఆరోపణలు చేసినప్పుడు, ఇషా గుప్తా పేరూ ప్రస్తావనకు వచ్చిందని, కొంతమంది 'ఆయన నాతోనూ అభ్యంతరకరంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ విషయంపై స్పందించిన ఇషా గుప్తా, "నిజం చెప్పాలంటే ఆయన నాతో ఎప్పుడూ ఆ విధంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. హిందీ చిత్రాలతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఇషా గుప్తా, 'వీడెవడు' అనే తెలుగు సినిమా కోసం కూడా పనిచేశారు.

Advertisement