Loading...
Esha singh: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్‌లో ఇషా సింగ్‌కు బంగారు పతకం.. మనూ బాకర్‌పై విజయం
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్‌లో ఇషా సింగ్‌కు బంగారు పతకం.. మనూ బాకర్‌పై విజయం

Esha singh: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్‌లో ఇషా సింగ్‌కు బంగారు పతకం.. మనూ బాకర్‌పై విజయం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 27, 2026
09:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాంగ్‌ఝౌ వేదికగా కొనసాగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్‌లో ఒలింపిక్స్ పతక విజేత మనూ బాకర్‌ను అధిగమించి విజేతగా నిలిచింది. ఫైనల్ పోటీలో స్థిరమైన లక్ష్యసాధనతో ఆకట్టుకున్న హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ 40 హిట్స్ నమోదు చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

వివరాలు

తుది పోరులో మరింత మెరుగైన ప్రదర్శన..

మరోవైపు మనూ బాకర్ కాంస్య పతకం కోసం పోటీ పడాల్సి వచ్చింది.

షూట్‌-ఆఫ్‌ దశను విజయవంతంగా దాటి వచ్చిన ఆమె చివరకు 28 హిట్స్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌లో భారత షూటర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు.

మనూ బాకర్ 586-20x స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. 21 ఏళ్ల ఇషా సింగ్ 585-18x స్కోరుతో రెండో స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించింది.

అయితే తుది పోరులో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ADVERTISEMENT