Ishan Kishan: చిన్నోడైనా పెద్దగా ఆడతాడు : ఇషాన్‌పై హర్భజన్ సింగ్ ప్రశంస
ఈ వార్తాకథనం ఏంటి
దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన సత్తా చాటిన ఈ ఎడమచేతి బ్యాటర్, ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే శతకం బాదేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో 39 బంతుల్లో ఏడు ఫోర్లు, 14 సిక్సర్లతో 125 పరుగులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ ఈ ప్రదర్శనపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఎత్తులో చిన్నవాడైనా ఇషాన్ చాలా పెద్ద షాట్‌లు ఆడతాడని, అతనిలో అసాధారణమైన ప్రతిభ ఉందని భజ్జీ కొనియాడాడు.
Details
అప్పుడే ఇషాన్ ప్రతిభ గుర్తించాను
ఈ సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఇషాన్‌కు బౌలింగ్ చేసిన అనుభవాన్ని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. ఇషాన్ ప్రతిభను నేను అప్పుడే గుర్తించాను. ఒకసారి ముంబయిలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అతనికి బౌలింగ్ చేశాను. ఒక బంతిని స్లోగా వేయగా.. కవర్స్ వైపు ఆలస్యంగా ఆడాడు. తర్వాతి బంతికి ఒక మోకాలిని నేలకు తాకించి ఫోర్ కొట్టాడు. ఆపై బాల్‌ను కొంచెం స్పీడ్‌గా వేస్తే రివర్స్ స్వీప్ ఆడాడు. నా బౌలింగ్‌పై స్విచ్ హిట్ ఇషాన్ కంటే మెరుగ్గా కెవిన్ పీటర్సన్ కూడా ఆడలేదని అనిపించింది.
Details
ఇషాన్ మళ్లీ జట్టులోకి రావడం అనందంగా ఉంది
ఇది నిజంగా ఒక స్పెషల్ టాలెంట్ అని అతనికి అప్పుడే చెప్పానని హర్భజన్ వెల్లడించాడు. కొంతకాలం టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని హర్భజన్ పేర్కొన్నాడు. 'అతను యువ ఆటగాడే అయినా ఎంతో పరిపక్వతతో ఆటను ఆడతాడు. ప్రస్తుత ఫామ్ చూస్తే అతని నుంచి ఇంకా గొప్ప ఇన్నింగ్స్‌లు చూడొచ్చని భజ్జీ అభిప్రాయపడ్డాడు.