LOADING...
Sanju Samson: ధోని రూట్‌లో వెళ్తా..జట్టు గెలుపే లక్ష్యం: సంజు శాంసన్
ధోని రూట్‌లో వెళ్తా..జట్టు గెలుపే లక్ష్యం: సంజు శాంసన్

Sanju Samson: ధోని రూట్‌లో వెళ్తా..జట్టు గెలుపే లక్ష్యం: సంజు శాంసన్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సంజు శాంసన్ తెలిపాడు. భారత జట్టుకు టీ20 ప్రపంచకప్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ముఖ్యమైన విజయాన్ని అందించిన సంజు, ఇప్పుడు సీఎస్కే తరపున తన మొదటి సీజన్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. "మహేంద్ర సింగ్ ధోని (మహి భాయ్)తో నేను ఫోన్‌లో మాట్లాడాను. ఆయనతో ఒకే జట్టులో కలిసి ఆడే అవకాశం రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందన్నారు. ధోని వంటి గొప్ప ఆటగాడి నుంచి నేర్చుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశమన్నారు. సీఎస్కే జట్టులో భాగమవ్వడానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నారు.

వివరాలు

చెన్నై అభిమానులకు థ్యాంక్స్

''నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న చెన్నై అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వ్యతిరేకంగా ఆడటం నాకు ఇదే మొదటిసారి. అయినప్పటికీ, మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వను. రాజస్థాన్‌తో ఉన్న అనుబంధం ఇప్పుడు ముగిసింది. నేను కొత్త జట్టులోకి వచ్చాను కాబట్టి, ఆ జట్టుకు వ్యతిరేకంగా ఆడేటప్పుడు నా పూర్తి సామర్థ్యంతో రాణించేందుకు కృషి చేస్తాను" అని సంజు వివరించాడు.

వివరాలు

జట్టు విజయమే ముఖ్యం

వ్యక్తిగత విజయాల కంటే జట్టు ప్రదర్శనకు ప్రాధాన్యం ఇవ్వడమే టీమ్ ఇండియా లక్ష్యమని సంజు శాంసన్ చెప్పాడు. "టీమ్ తర్వాతే వ్యక్తిగత రికార్డ్స్ అనే విషయాన్ని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో తరచుగా గుర్తు చేస్తుంటారని, జట్టులోని ప్రతి ఆటగాడు ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తాడని అన్నారు. తాను కూడా కెరీర్ ప్రారంభం నుంచి అదే నమ్మకంతో ముందుకు సాగుతున్నట్లు వివరించాడు. కేరళ టోర్నీల్లో ఆడుతున్న రోజుల నుంచే ఆ ఆలోచనతోనే తాను ఆటను కొనసాగిస్తున్నానని, జట్టు గెలుపు కోసం తన శక్తిమేర ప్రయత్నిస్తానని సంజు తెలిపాడు.

Advertisement