
Asia Cup trophy: ట్రోఫీ ఇవ్వకపోయినా.. ఖాళీ చేతులతోనే ఆసియా కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసిన టీమిండియా!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ ఫైనల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పటికే ప్లేయర్ల కరచాలన, వాదనలు చెలరేగగా, తాజా ట్రోఫీ ప్రదాన కార్యక్రమం మరింత ఉద్రిక్తమైంది. ఆసియా కప్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది. మోసిన్ నఖ్వి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)చీఫ్‌గా ఉన్నాడు. సాధారణంగా ఆనవాయితీ ప్రకారం విజేతకు ట్రోఫీ అందజేయాలనుకుంటారు, కానీ భారత్ దీన్ని మానుకొని ఖాళీ చేతులతోనే విజయాన్ని సెలబ్రేట్ చేసింది. ఫొటోలకు ఫోజులిచ్చిన తర్వాత భారత జట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఈ దృష్యాలు వైరల్‌గా మారాయి.
Details
5 వికెట్ల తేడాతో గెలుపు
బహుమతి ప్రదానోత్సవంలో తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', అభిషేక్ శర్మ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ', కుల్‌దీప్ 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్' అవార్డులను వేరే అతిథుల నుంచి స్వీకరించుకున్నారు. ఆసియాకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీర్ఘకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఫైనల్లో శక్తివంతంగా ఎదుర్కొని మట్టికరిపించింది. టోర్నీలో మూడోసారి పాకిస్థాన్‌ను ఓడిస్తూ టీమిండియా దుబాయ్ స్టేడియంలో సత్తా ప్రదర్శించింది. పహల్గాం ఉగ్రదాడితో సృష్టించిన ఉద్రిక్త పరిస్థితిలో కూడా భారత్ తమ ప్రభావాన్ని చాటింది. సమిష్టి ప్రదర్శనతో పాక్‌ను ఓడించిన టీమ్‌ఇండియా, తొమ్మిదో సారి ఆసియాకప్‌ను రికార్డు స్థాయిలో సగర్వంగా ముద్దాడింది. ఫైనల్‌లో, పాక్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీమిండియా సెలబ్రేషన్స్ వీడియో
India lift the Asia Cup Trophy in Dubai even though Pakistan Interior Minister Mohsin Naqvi cowardly stole it. Epic trolling of Pakistan by the Indian Cricket Team. pic.twitter.com/H0udtGSenP
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025