రంజీ ట్రోఫీలో దుమ్ములేపిన పృథ్వీషాను జాతీయ జట్టులోకి తీసుకోవాలి
రంజీట్రోఫిలో ముంబై తరుపున పృథ్వీ షా 379 పరుగులు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టాడు. పృథ్వీషా బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్నా జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. అయితే చివరిసారిగా జూలై 2021లో టీ20లో టీమిండియా తరుపున ఆడాడు. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, షాను టీమిండియా జట్టులో ఎంపిక కావడం లేదు. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున 379 పరుగులతో రంజీ ట్రోఫీ చరిత్రలో రెండవ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు ముంబై చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. పృథ్వీషాను జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లను మాజీ ఫేసర్ వెంకటేష్ ప్రసాద్ కోరారు.
అవకాశాలు రాకపోవడంతో పృథ్వీషా నిరాశ
పృథ్వీషాను జట్టు నుంచి దూరం పెట్టడానికి కారణాలు ఎన్ని అయినా ఉండొచ్చు, కానీ నైపుణ్యం గల బ్యాట్ మెన్ను గుర్తించి సెలెక్టర్ల పని అని వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ పృథ్వీషాకి ఇచ్చినా అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నా జాతీయ జట్టు ఎంపికలో మాత్రం పృథ్వీషాను పట్టించుకోవడం లేదు. దీనిపై పృథ్వీషా స్పందించాడు. మంచిగా ఆడుతున్నా, మైదానంలో, బయట క్రమశిక్షణతో మెలుగుతున్న అవకాశాలు రాకపోవడంతో చాలా నిరుత్సాహానికి గురవుతుంటానని పృథ్వీ షా చెప్పారు. అవకాశాలు రాకపోవడంతో అభిమానులు, నా గురించి తెలియని వారు కూడా తననే జడ్జ్ చేస్తుంటారని పృథ్వీషా వాపోయారు.