విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. 127కే కోల్ కతా ఆలౌట్
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన కోల్ కతాకు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ (4), వెంకటేష్ అయ్యర్(0), నితీష్ రాణా(4) పూర్తిగా నిరాశపరిచారు. కేవలం 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కోల్ కతా కష్టాల్లో పడింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనదీప్ సింగ్(12), రికూసింగ్ (6) ఇంపాక్ట్ ప్లేయర్ అకుల్ రాయ్(0) ఢిల్లీ బౌలర్ల ధాటికి పెవిలియానికి చేరారు
ఢిల్లీ బౌలర్ల దెబ్బకు పెవిలియానికి చేరిన కోల్ కతా బ్యాటర్లు
ఈ క్రమంలో జోసన్ రాయ్ 43 పరుగులతో రాణించాడు. చివర్లో అండ్రూ రసెల్ 30 బంతుల్లో 37 పరుగులు చేయడంలో కోల్ కతా గౌరవ ప్రదమైన స్కోరును చేసింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు కోల్ కతా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు. ఆరుగురు బ్యాటర్లు కేవలం సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోకియా, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్ రెండు వికెట్లతో చెలరేగగా.. ముకేష్ కుమార్ ఒక వికెట్ తీశారు. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌటైంది.