LOADING...
RCB vs SRH: రాణించిన ఫడిక్కల్, విరాట్ కోహ్లీ.. ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం
రాణించిన ఫడిక్కల్, విరాట్ కోహ్లీ.. ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం

RCB vs SRH: రాణించిన ఫడిక్కల్, విరాట్ కోహ్లీ.. ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
11:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు, 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, ఆర్సీబీ బ్యాటర్ల ధాటికి అది సరిపోలేదు. ఈ విజయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా దేవదత్ పడిక్కల్ ప్రదర్శన ప్రత్యేకంగా గుర్తింపును పొందింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 69 పరుగుల అర్ధ సెంచరీతో రాణించారు.

వివరాలు

ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు

ఇక పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇషాన్ కిషన్ 80 పరుగులు చేసినా, ఆర్‌సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ తరుపున అరంగేట్రం చేసిన జేకబ్ డఫీ అద్భుత ప్రదర్శన చూపాడు.కీలక సమయాల్లో 3 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. రోమారియో షెపర్డ్ కూడా 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి కీలక సహకారం అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో డేవిడ్ పేన్ రెండు వికెట్లు సాధించినప్పటికీ, పరుగుల నియంత్రణలో విఫలమయ్యాడు.

వివరాలు

దేవదత్ పడిక్కల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

మ్యాచ్‌లో అసలు మలుపు ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఎంట్రీతో వచ్చింది. మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు, కోహ్లీతో రెండో వికెట్ భాగస్వామ్యం ఏర్పాటు చేసి హైదరాబాద్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాడు. 7 ఫోర్లు, 4 సిక్సర్లతో రాణించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ, తొలి మ్యాచ్‌లోనే విజయ సాధించి తమ అభిమానులకు అద్భుత ఆరంభం ఇచ్చింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6 వికెట్ల తేడాతో గెలుపు

Advertisement