వన్డేలోకి అరంగ్రేటం చేసిన శ్రీలంక ఆటగాడు ఫెర్నాండో
భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక బ్యాటర్ సువానీడు ఫెర్నాండో తన తొలి అంతర్జాతీయ క్యాప్‌ను అందుకున్నారు. కుడిచేతి వాటం కలిగిన ఈ ఓపెనర్ తన కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక వెన్నుముక గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. ఆయన స్థానంలో ఫెర్నాండో రెండో వన్డేలో ఎంపికయ్యాడు. ఫెర్నాండో అక్టోబర్ 13, 1999న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. కుడిచేతి వాటం బ్యాటర్ 2018 అండర్-19 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టులో ఉన్నాడు. 2016లోనే ఫెర్నాండో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. లిస్ట్-ఎ 23 మ్యాచ్ లాడిన ఫెర్నాండో 35.61 సగటుతో 748 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 86.57 ఉంది. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు, రెండు సెంచరీలున్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫెర్నాండో సాధించిన రికార్డులివే
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 31 మ్యాచ్ లు ఆడాడు.40.25 సగటుతో 1,771 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధసెంచరీలు, ఆరు సెంచరీలున్నాయి. ఫెర్నాండో 34 టీ20ల్లో 28.14 సగటుతో 760 పరుగులు చేశాడు. లంక ప్రీమియర్ లీగ్ లో ఫెర్నాండో ఆకట్టుకున్నాడు. గాలే గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్న అతను తొమ్మిది గేమ్‌లలో 30.14 సగటుతో 211 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 34 ఓవర్లకు 178 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది.