Loading...
Japan Open 750: జపాన్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు స్టార్
జపాన్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు స్టార్

Japan Open 750: జపాన్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు స్టార్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ షట్లర్, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో చారిత్రక ఘనత సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ చరిత్రలో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత మహిళా షట్లర్‌గా నిలిచి కొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ పోరులో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చైనాకు చెందిన చెన్ యుఫీయ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 21-19తో కైవసం చేసుకున్న సింధు, రెండో సెట్‌లో 15-10తో ఆధిక్యంలో కొనసాగింది. ఈ సమయంలో ప్రత్యర్థి చెన్ యుఫీయ్ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో సింధు విజేతగా నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

వివరాలు

ఫైనల్‌లో సింధు ప్రత్యర్థి ఎవరు?

జపాన్ ఓపెన్ 750 టోర్నీ ఫైనల్‌లో పీవీ సింధు ఎవరితో తలపడనుందో ఇంకా ఖరారు కాలేదు.

జపాన్‌కు చెందిన అకనె యమగుచి, ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దాని మధ్య జరిగే మరో సెమీఫైనల్‌లో విజేత ఫైనల్‌లో సింధుకు ప్రత్యర్థిగా నిలవనుంది.

ఈ తుది పోరులో సింధు విజయం సాధిస్తే జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారత షట్లర్‌గా మరో అరుదైన చరిత్రను సృష్టించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

ADVERTISEMENT