LOADING...
Fifa World Cup: బెల్జియం దెబ్బకు అమెరికా నిష్క్రమణ.. ఆతిథ్య దేశాల ప్రయాణానికి ముగింపు
బెల్జియం దెబ్బకు అమెరికా నిష్క్రమణ.. ఆతిథ్య దేశాల ప్రయాణానికి ముగింపు

Fifa World Cup: బెల్జియం దెబ్బకు అమెరికా నిష్క్రమణ.. ఆతిథ్య దేశాల ప్రయాణానికి ముగింపు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశాలుగా బరిలోకి దిగిన జట్ల ఆశలు ఒక్కొక్కటిగా ముగిశాయి. ఇప్పటికే కెనడా, మెక్సికో టోర్నీకి వీడ్కోలు పలకగా.. ఇప్పుడు అమెరికా కూడా ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మెక్సికో ఇంగ్లాండ్‌కు గట్టి సవాల్ విసిరినప్పటికీ, అమెరికా మాత్రం బెల్జియం దాడులను అడ్డుకోలేక 4-1 తేడాతో ఓటమి పాలైంది. బెల్జియం విజయానికి చార్లెస్ డి కెటెలార్ ప్రధాన బలంగా నిలిచాడు. అనంతరం 57వ నిమిషంలో హాన్స్ వానకేన్ ఒక గోల్ నమోదు చేయగా, అదనపు సమయంలో (90+3) స్టార్ స్ట్రైకర్ రొమేలు లుకాకు మరో గోల్‌తో విజయాన్ని మరింత ఘనంగా మలిచాడు. అమెరికా తరఫున మాలిక్ టిల్‌మ్యాన్ 31వ నిమిషంలో చేసిన గోల్ మాత్రమే ఓదార్పుగా మిగిలింది.

వివరాలు

పూర్తిగా మారిన బెల్జియం ఆటతీరు..

గణాంకాల పరంగా చూస్తే అమెరికా బంతిని 51 శాతం సమయం తన ఆధీనంలో ఉంచుకుంది. బెల్జియం వద్ద కేవలం 40 శాతం మాత్రమే బాల్ పొజెషన్ ఉన్నప్పటికీ, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అసాధారణ ప్రతిభను కనబరిచింది. గోల్‌పై దాడుల విషయంలో 15-7, టార్గెట్‌పై షాట్లలో 7-2 ఆధిక్యాన్ని నమోదు చేస్తూ మ్యాచ్ మొత్తాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. అమెరికా గోల్‌కీపర్‌తో పాటు రక్షణ విభాగం పలుమార్లు తప్పిదాలు చేయడంతో బెల్జియంకు వరుస అవకాశాలు లభించాయి. ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా, విరామ సమయానికి స్కోరు 1-1తో సమంగా నిలిచింది. అయితే రెండోార్ధంలో బెల్జియం ఆటతీరు పూర్తిగా మారిపోయింది. వేగవంతమైన దాడులతో మరో మూడు గోల్స్ సాధించి అమెరికా ఆశలకు తెరదించింది.

Advertisement