FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయిన రిఫరీ.. అనుమానాస్పదంగా మృతి
ఈ వార్తాకథనం ఏంటి
2026 ఫిఫా ప్రపంచకప్‌కు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో నెదర్లాండ్స్‌కు చెందిన రిఫరీ రాబ్ డిపెరింక్ (38) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాబ్ డిపెరింక్‌ను 2026 ఫిఫా ప్రపంచకప్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) బృందంలో విధులు నిర్వహించే అధికారిగా ఎంపిక చేశారు. అయితే, అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఫిఫా అధికారులు అతడిని ప్రపంచకప్ అధికారుల జాబితా నుంచి తొలగించారు.
వివరాలు
2017 నుంచి ఆయన నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ రిఫరీగా సేవలు
ఆరోపణలపై దర్యాప్తు జరిపిన అనంతరం వాటిని నిర్ధారించే తగిన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసివేశారు.
అయినప్పటికీ, రాబ్ డిపెరింక్ తాజాగా అనుమానాస్పదంగా మృతి చెందడం పలు సందేహాలకు దారితీస్తోంది.
తనపై వచ్చిన ఆరోపణలు,వాటి కారణంగా ఎదురైన అవమానం,ప్రపంచకప్‌లో పనిచేసే అవకాశాన్ని కోల్పోవడం వంటి అంశాల ప్రభావంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
రాబ్ డిపెరింక్ మృతి చెందిన విషయాన్ని డచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారికంగా ధ్రువీకరించింది.
2017 నుంచి ఆయన నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ రిఫరీగా సేవలందిస్తున్నాడు.
అలాగే 2024 యూరో చాంపియన్‌షిప్‌లో కూడా వీఏఆర్ బృందంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.
వివరాలు
అసంతృప్తి వ్యక్తం చేసిన రాబ్ డిపెరింక్
ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2026 ఫిఫా ప్రపంచకప్ వీఏఆర్ అధికారుల జాబితాలో కూడా చోటు కల్పించారు.
అయితే,ఈలోపు లైంగిక ఆరోపణలు వెలుగులోకి రావడంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రాబ్ డిపెరింక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈపరిణామాల నేపథ్యంలో ఫిఫా అధికారులు అతడిని ప్రపంచకప్ అధికారుల బృందం నుంచి తప్పించారు.
ఈచర్యపై రాబ్ డిపెరింక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని,ఎలాంటి తప్పు చేయకపోయినా అరెస్టు చేశారని ఆయన వాదించాడు.
ఈకారణంగానే 2026 ఫిఫా ప్రపంచకప్‌లో వీఏఆర్ రిఫరీగా పనిచేసే అరుదైన అవకాశాన్ని కోల్పోయానని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన మృతికి గల అసలు కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.