ENG Vs SL: శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు చావోరేవో.. ఎవరు నిలుస్తారో..!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న ఇంగ్లండ్, శ్రీలంక కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక విజయం సాధించిన శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. మొదట్లో పేసర్లకు పిచ్ సహకరించనుంది. వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ సూచించింది. ఉష్ణోగ్రత పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.
ఇరు జట్లలోని సభ్యులు వీరే!
ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ రెండుసార్లు గెలిచింది, ఒకసారి మ్యాచులో ఓడగా, మరో మ్యాచ్ టై అయింది. 1982లో శ్రీలంక ఈ మైదానంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ జట్టు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (C & WK), హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్. శ్రీలంక జట్టు పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుసల్ మెండిస్ (C & WK), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత/దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మదుశంక.