WPL: ఫైనల్ సమరం నేడు: దిల్లీ vs బెంగళూరు.. ట్రోఫీ ఎవరి సొంతం?
ఈ వార్తాకథనం ఏంటి
డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్ దాకా వెళ్లి కప్పు చేజార్చుకున్న జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వరుసగా మూడు సీజన్లలో (2023, 2024, 2025) ఆఖరి పోరుకు చేరినా... ప్రతిసారీ నిరాశే ఎదురైంది. అయినా పట్టుదల వదలకుండా మరోసారి టైటిల్ సమరానికి అర్హత సాధించింది. ఇక మరోవైపు అద్భుతమైన ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబ్ల్యూపీఎల్-4 ఫైనల్‌కు దూసుకొచ్చింది. గత సీజన్ ఫైనల్‌లో దిల్లీని ఓడించి ట్రోఫీ అందుకున్న బెంగళూరు... ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరి ఈసారి దిల్లీకి కల నెరవేరుతుందా? లేక బెంగళూరు రెండోసారి కప్పు ముద్దాడుతుందా? గురువారం జరిగే ఫైనల్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది.
వివరాలు
దిల్లీ కల తీరేనా:
డబ్ల్యూపీఎల్ ఆరంభం నుంచి మెగ్ లానింగ్ నేతృత్వంలో దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్‌లో నిలుస్తూ వచ్చింది. కానీ ప్రతిసారీ చివరి అడ్డంకిని దాటలేకపోయింది. ఈ సీజన్‌లో లానింగ్ జట్టులో లేకపోయినా... దిల్లీ ప్రదర్శనలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. కొత్త కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో జట్టు మళ్లీ ఫైనల్‌కు చేరింది. లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దిల్లీ... నాలుగింట్లో విజయం సాధించి, నాలుగింట్లో ఓటమి చవిచూసింది. అనంతరం ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఆఖరి పోరుకు టికెట్ దక్కించుకుంది.
వివరాలు
దిల్లీ కల తీరేనా:
బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో దిల్లీ మరింత బలంగా కనిపిస్తోంది. లిజెలీ లీ, షెఫాలి వర్మలతో కూడిన ఓపెనింగ్ జంటే జట్టుకు కీలక శక్తి. ఈ ఇద్దరు ఇస్తున్న వేగవంతమైన ఆరంభాలే దిల్లీ విజయాలకు ఆధారం. ఎలిమినేటర్‌లో లిజెలీ బ్యాటింగ్‌లోనే కాదు... వికెట్ కీపింగ్‌లో కూడా అదరగొట్టింది. లారా వోల్వార్ట్, జెమీమా, మరిజేన్ కాప్‌లతో బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో యువ ఆటగాళ్లు నందని శర్మ, శ్రీచరణి ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా నందని కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు ఊపునిస్తోంది. మరిజేన్ కాప్, షినెలి హెన్రీలు కూడా బంతితో రాణిస్తే దిల్లీని ఆపడం ప్రత్యర్థులకు కష్టమే.
వివరాలు
మరోసారి అందుకుంటుందా!:
2024లో తొలిసారి డబ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తోంది. గతేడాది లీగ్ దశలోనే నిష్క్రమించిన ఆర్సీబీ... ఈసారి పూర్తిగా మారిన జట్టుగా కనిపించింది. తొలి అయిదు మ్యాచ్‌ల్లో వరుసగా గెలిచి నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా... యూపీపై కీలక విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన (290 పరుగులు) ఆ జట్టుకు ప్రధాన ఆధారం. ఫైనల్లో ఆమె నుంచి పెద్ద ఇన్నింగ్స్‌ను ఆర్సీబీ ఆశిస్తోంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన గ్రేస్ హారిస్ (228), రిచా ఘోష్ (183) కూడా ఆఖరి పోరులో కీలక పాత్ర పోషించవచ్చు.
వివరాలు
మరోసారి అందుకుంటుందా!:
ఆల్‌రౌండ్ ఆటతో ఆకట్టుకుంటున్న నదైన్ డిక్లెర్క్ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి జట్టుకు పెద్ద బలం అయింది. పవర్‌ప్లేలో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్న లారెన్ బెల్, మధ్య ఓవర్లలో పరుగుల వేగాన్ని కట్టడి చేస్తున్న శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్‌ల ప్రదర్శన కూడా ఫైనల్‌లో కీలకం కానుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లోనే 116 డాట్ బాల్స్ వేసిన లారెన్ బెల్ నుంచి బెంగళూరు భారీ ఆశలు పెట్టుకుంది.
వివరాలు
హెడ్‌టు-హెడ్
ఇప్పటివరకు బెంగళూరు, దిల్లీ తొమ్మిది సార్లు తలపడగా... ఆరుసార్లు దిల్లీ విజయం సాధించింది. అయితే 2024 ఫైనల్లో మాత్రం బెంగళూరే దిల్లీపై పైచేయి సాధించింది. డబ్ల్యూపీఎల్-4లో ఈ రెండు జట్లు రెండుసార్లు ఎదుర్కొనగా... చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి.