తదుపరి వార్తా కథనం
INDvsNZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత్ లక్ష్యం ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 11, 2026
05:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) అర్ధశతకాలతో రాణించి జట్టును భారీ స్కోర్ వైపు నడిపించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండేసి వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ సాధించారు.