India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా?
దక్షిణాఫ్రికాలో టీ-20 సిరీస్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడబోతోంది. ఈ క్రమంలో గురువారం మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా ఆడుతున్న చివరి టీ20 సిరీస్ ఇదే. దీంతో ఈ సిరీస్‌లో సత్తా చాటాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20కి విరాట్ కోహ్లీ ఆడటం లేదని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు.
మొహాలీ పిచ్ రిపోర్టు ఇదే..
మొహాలీ క్రికెట్ స్టేడియం పిచ్ ఎరుపు, నలుపు మట్టి మిశ్రమంతో ఉంటుంది. ఈ పిచ్‌లో మంచి బౌన్స్ ఉంటుంది. బౌన్స్‌తో పాటు వేగం కారణంగా బంతి బ్యాట్ పైకి వస్తుంది దీంతో బ్యాటర్‌కు షాట్ ఆడటం చాలా సులువు అవుతుంది. ఈ స్టేడియం అవుట్‌ఫీల్డ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. దీని కారణంగా ఫోర్లు, సిక్సర్ల వర్షం చూడవచ్చు. అయితే ఈ మ్యాచ్‌లో మంచు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ప్రారంభంలో తేమను సద్వినియోగం చేసుకోవాడానికి అవకాశం ఉంటుంది. మంచు ప్రభావం వల్ల రెండో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే వారికి కొంత ఉపయోగపడవచ్చు.
మొహాలీ స్టేడియం గణాంకాలు ఇవే
మొహాలీ స్టేడియంలో 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు రెండుసార్లు విజయం సాధించాయి. తరువాత బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగు సార్లు గెలిచాయి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 168పరుగులు. ఈ స్డేడియంలో భారత జట్టు అత్యధిక స్కోరు 211/4. ఈ పిచ్‌పై నమోదైన తక్కువ స్కోరు స్కోరు 149 పరుగులు (దక్షిణాఫ్రికా vs భారత్, 2019). ఇక్కడ ఆడిన 4 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భారత్ 3గెలిచింది. అయితే ఈ పిచ్‌పై అఫ్గాన్‌తో టీమిండియా ఒక్క టీ20 కూడా ఆడలేదు. మొహాలీలో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంటుంది.