IND vs SA: భారత్‌తో తొలి టెస్టు.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. టాస్‌లో గెలుపొందిన సఫారీ జట్టు ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. భారత జట్టు ఇప్పటివరకు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉన్నప్పటికీ, ఈసారి ప్రపంచ ఛాంపియన్ హోదాలో సఫారీలు మరింత నమ్మకంతో మైదానంలోకి దిగారు. దాదాపు సమాన శక్తిసామర్థ్యాలతో ఉన్న ఈ రెండు బలమైన జట్ల మధ్య టెస్టు సమరం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగనుందని ఖాయంగా కనిపిస్తోంది.
Details
టీమిండియా జట్టు ఇదే
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (సి), రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా జట్టు ఇదే ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(సి), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(w), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్