ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ప్రైమ్ వాలీబాల్ సహకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ఫైనల్‌కు ముందు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ జనరల్ డైరెక్టర్ ఫాబియో అజెవెడో ప్రకటించారు. పివిఎల్ ఫైనల్ ప్రారంభానికి ముందు, ఎఫ్‌ఐవిబి జనరల్ డైరెక్టర్ మాట్లాడారు. భారతదేశంలో వాలీబాల్ అభివృద్ధికి కృషి చేయడానికి పివిఎల్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో వల్ల కొత్త ఫార్మాట్‌ను ప్రపంచంలోని వాలీబాల్ అభిమానులు చూస్తారని, వరుసగా రెండేళ్లు వాలీబాల్ ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం తమకు సంతోషంగా ఉందన్నారు ఫాబియో అజెవెడో .
భారతదేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, తాము పురుషుల వాలీబాల్‌లో అత్యుత్తమ క్లబ్‌లు, అద్భుతమైన అథ్లెట్ల ప్రదర్శనలను అందించడం చాలా గొప్ప విషయమన్నారు.
వాలీబాల్
రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత అభివృద్ధి
వాలీబాల్ లీగ్‌తో భాగస్వామ్యం కావడం వల్ల రాబోయే సంవత్సరాల్లో ఈ క్రీడ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, FIVB తరుపున తాము పెట్టుబడి పెట్టడానికి ముందకొస్తామని ఫాబియో అజెవెడో తెలియజేశారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్ వాలీబాల్ ప్రపంచంలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటు భారతీయ వాలీబాల్ స్టార్లు తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించేందుకు తొలిసారిగా అవకాశం లభించిందని వాలీబాల్ జనరల్ డైరెక్టర్ పేర్కొన్నారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలీబాల్ ప్రేక్షకులను ఈ లీగ్ ఆకర్షిస్తుందని వాలీబాల్ వరల్డ్ CEO ఫిన్ అన్నారు.