
Velugoti Rajagopal: ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
రాజ కుటుంబానికి చెందిన, ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వెలుగోటి రాజగోపాల్ యాచేంద్ర (వయసు 94) గురువారం నెల్లూరులో తుదిశ్వాస విడిచారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థానానికి చెందిన ఆయన, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు.
క్రికెట్ రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది.ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆయన మొత్తం 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నారు.
1956-57 సీజన్‌లో ట్రావెన్‌కోర్-కొచ్చి జట్టుతో గుంటూరులో జరిగిన మ్యాచ్ ద్వారా ఆయన రంజీ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టారు.
1964-65 సీజన్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజగోపాల్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును నడిపించారు.
వివరాలు
టెన్నిస్ లోనూ రాజగోపాల్ కు విశేష గుర్తింపు
కుడిచేతి బ్యాట్స్‌మన్‌గా మంచి ప్రదర్శన ఇవ్వడమే కాకుండా,స్పిన్ బౌలింగ్‌లోనూ నైపుణ్యం కనబరిచి పలువురు ప్రత్యర్థుల వికెట్లు పడగొట్టారు.
ఆటగాడిగా మాత్రమే కాకుండా,కోచ్‌గా కూడా ఆయన విలక్షణంగా నిలిచారు. ఆంధ్ర క్రికెట్‌లో ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఆయన రూపొందించారు.
కేవలం క్రికెట్‌కే పరిమితమవకుండా, టెన్నిస్ లోనూ రాజగోపాల్ కు విశేష గుర్తింపు పొందారు.
రాజగోపాల్ యాచేంద్ర మరణ వార్తతో ఆంధ్ర క్రికెట్ సంఘం తీవ్రంగా విషాదంలో మునిగిపోయింది.
సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్‌బాబు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
ఆయన మరణం, ఆంధ్ర క్రికెట్ ప్రపంచానికి పూరించలేని లోటు అని వారు పేర్కొన్నారు.