
BCCI: బీసీసీఐ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్.. ఆయన ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమాచారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన పేరు బీసీసీఐ అధ్యక్ష పదవికి బలంగా వినిపిస్తున్న వేళ, సెప్టెంబర్ 28న ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) అనంతరం అధికారికంగా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తరువాత వరుసగా అధ్యక్ష పదవిని చేపట్టిన మూడవ మాజీ క్రికెటర్‌గా నిలిచారు. 45 ఏళ్ల మిథున్ మన్హాస్ క్రికెట్ పరిపాలనలోనూ అనుభవం కలిగిన వ్యక్తి.
Details
157 ఫస్ట క్లాస్ మ్యాచుల్లో 27 సెంచరీలు
గతంలో ఆయన జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో క్రికెట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనతో పాటు రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా, దేవజిత్ సైకియా గౌరవ కార్యదర్శిగా, ప్రభతేజ్ సింగ్ భాటియా జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు. మిథున్ మన్హాస్ 1979 అక్టోబర్ 12న జమ్ముకశ్మీర్‌లో జన్మించారు. 1997-98 సీజన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన అరంగేట్రం చేశారు. మొత్తం 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 9714 పరుగులు చేసి, 27 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
Details
ఐపీఎల్ లో 55 మ్యాచులు ఆడిన అనుభవం
లిస్ట్-ఎ క్రికెట్‌లో 130 మ్యాచ్‌లు ఆడి 4126 పరుగులు సాధించారు. ఇందులో 5 సెంచరీలు, 26 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా, 91 T20 మ్యాచ్‌లలో 1170 పరుగులు చేయడంతో పాటు బౌలర్‌గా 70 వికెట్లు తీశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడారు. IPLలో మొత్తం 55 మ్యాచ్‌ల్లో 514 పరుగులు చేశారు. క్రికెట్ అనుభవం, పరిపాలన నైపుణ్యం కలగలిపి ఆయనను BCCI అధ్యక్షుడి పదవికి తీసుకువచ్చాయి.