Dattaji Gaekwad: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత
భారత మాజీ టెస్ట్ క్రికెటర్,కెప్టెన్, దత్తాజీ గైక్వాడ్, మంగళవారం తెల్లవారుజామున మరణించారు. దత్తాజీకి 95 సంవత్సరాలు. ఈ విషయాన్ని ప్రఖ్యాత స్పోర్ట్స్ ఎడిటర్, అభిషేక్ త్రిపాఠి, అదిరాజ్ సిన్హ జడేజా X లో ప్రకటించారు. దత్తజీ భారత్ తరుపున 11 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. రంజీ ట్రోఫీలో 14 సెంచరీలతో 3,139 పరుగులు చేశారు. DK గా ప్రసిద్ధి చెందిన దత్తాజిరో కృష్ణారావు బరోడాకు ప్రాతినిధ్యం వహించారు. 2016లో 87 ఏళ్ల వయసులో దీపక్ శోధన్ మరణం తర్వాత జీవించి ఉన్న భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్దుడిగా ఉన్నారు. ఇప్పుడు DK మరణంతో, C.D. గోపీనాథ్ జీవించి ఉన్న భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడు అయ్యాడు.