IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌లో కేఎల్ రాహుల్ స్థానంపై గందరగోళం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంకా కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్‌కు సంబంధించిన బ్యాటింగ్ స్థానంపై నెలకొన్న సమస్యలను వివరించాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి సీజన్‌లో ఢిల్లీ జట్టు రాహుల్‌ను ఏ స్థానంలో ఆడించాలనే విషయంలో అయోమయం పడుతోందన్నారు. రాహుల్‌కు ఓపెనర్‌గా ఆడడం ఇష్టం ఉన్నప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం అతడిని మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని చూస్తోందన్నారు.
వివరాలు
ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?
ఈ సీజన్‌లో అయినా ఈ సమస్యకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని బద్రీనాథ్ సూచించాడు. అంతేకాకుండా ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సంతృప్తిగా ఉన్నాడా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌లో చాలా ఎంపికలు ఉన్నాయన్నారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్‌లను రిలీజ్ చేసిన తర్వాత, పాథుమ్ నిశాంక, బెన్ డకెట్‌లను జట్టులోకి చేర్చుకుంది. అలాగే వేలంలో పృథ్వీ షాను కూడా సొంతం చేసుకుని తమ బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలపరిచింది.
వివరాలు
టైటిల్ కోసం తహతహలాడుతున్న టీమ్
మిడిల్ ఆర్డర్‌లో కూడా డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీశ్ రాణా వంటి ఆటగాళ్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, తుది జట్టును ఎంపిక చేయడంలో వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశముంది. అయినా సరే, ఈసారి అయినా మెరుగైన ఆటతీరుతో తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది. మరి ఈసారైనా ఈ జట్టు విజయం సాధిస్తుందో..లేదో తెలియాలంటే కొంత కాలం ఎదురుచూడాల్సిందే.