Page Loader
IND vs ENG: నలుగురు అరంగేట్రం.. గిల్ కెప్టెన్సీలో తొలి టెస్ట్‌కు భారత్ ప్లేయింగ్ XI ఇదేనా?
నలుగురు అరంగేట్రం.. గిల్ కెప్టెన్సీలో తొలి టెస్ట్‌కు భారత్ ప్లేయింగ్ XI ఇదేనా?

IND vs ENG: నలుగురు అరంగేట్రం.. గిల్ కెప్టెన్సీలో తొలి టెస్ట్‌కు భారత్ ప్లేయింగ్ XI ఇదేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేందుకు సమయం ఆసన్నమైంది. జూన్ 20, 2025 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌ను సొంత గడ్డపై ఎదుర్కొనబోతోంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సైకిల్‌లో భాగం కావడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో ఇది భారత్‌కు తొలి సిరీస్ కావడం గమనార్హం.

Details

లీడ్స్‌లో మొదటి టెస్ట్ - ఓపెనింగ్‌లో జైస్వాల్, రాహుల్?

సిరీస్‌లో తొలి టెస్ట్ లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరగనుంది. ఓపెనింగ్ బాధ్యతలు ఎవరు భుజాన వేసుకుంటారన్నదే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సాంకేతికత, దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. స్వింగ్ బౌలింగ్‌కు పేరుగాంచిన ఇంగ్లాండ్‌ కండిషన్లలో అతని టెక్నిక్ నిజమైన పరీక్ష ఎదుర్కొననుంది. అతనితో కలసి అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.

Details

గిల్ మూడో స్థానం.. కరుణ్ నాయర్‌కు రీ-ఎంట్రీ?

శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత టెస్టుల్లో కూడా అతను ఇదే స్థానంలో స్థిరపడ్డాడు. గిల్ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీని ఎలా నిర్వహిస్తాడన్నది క్రికెట్ లోవర్లలో ఆసక్తికర అంశం. ఇక కరుణ్ నాయర్ టెస్ట్ జట్టులోకి తిరిగొస్తున్నట్లు వార్తలున్నాయి. ఇండియా 'ఎ' తరఫున డబుల్ సెంచరీ, దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ఫామ్‌ కారణంగా అతనికి నాలుగో స్థానంలో అవకాశం దక్కే వీలుంది. మిడిల్ ఆర్డర్ స్థిరత కోసం పంత్, నితీష్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. అతని దూకుడు, వికెట్ కీపింగ్ సామర్థ్యం ఇంగ్లాండ్ పరిస్థితుల్లో కీలకం కానుంది. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యే అవకాశముంది.

Details

రవీంద్ర జడేజా స్థానం ఖాయం

ఆస్ట్రేలియాతో ఇటీవలె జరిగిన మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఎంపిక న్యాయంగానే కనిపిస్తుంది. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా స్థానం ఖాయం. అతని స్పిన్‌తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ భారత్‌కు కీలకం. శార్దూల్ ఠాకూర్ తన బ్యాటింగ్, సీమ్ బౌలింగ్‌తో జట్టుకు మద్దతు ఇవ్వగలడు. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీ చేసి తాను ఇంకా రెడీగానే ఉన్నానని చాటాడు. బుమ్రా-సిరాజ్ కాంబో.. అర్ష్‌దీప్‌కు అరంగేట్ర అవకాశం? జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యూనిట్‌ను నాయకత్వం వహించనున్నాడు. అతనికి తోడుగా మొహమ్మద్ సిరాజ్ ఉండనున్నారు. రెండుగురూ తమ వేగం, లైన్, లెంగ్త్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేయగలరు. ఇక యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది.

Details

నలుగురు ఆటగాళ్లకు ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్

కౌంటీ క్రికెట్ అనుభవంతో పాటు స్వింగ్ బౌలింగ్ నైపుణ్యం అతని బలంగా మారాయి. ఈ మ్యాచ్ ద్వారా నాలుగు ఆటగాళ్లకు ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్ట్ ఆడే అవకాశం ఉంది - యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్. వీరందరూ ఇంగ్లాండ్‌లో టెస్ట్ అరంగేట్రం చేయనున్నట్టే భావించవచ్చు. మొత్తం మీద గిల్ కెప్టెన్సీలో ప్రారంభమయ్యే ఈ కొత్త టెస్ట్ జర్నీలో భారత్ ఎలా రాణిస్తుంది, కొత్త ఆటగాళ్లు తమ తొలి టెస్టుల్లో ఎలా మెరిసిపోతారో చూడాలంటే జూన్ 20 వరకు ఆగాల్సిందే!