ఉచిత ఐపీఎల్ టికెట్లు.. హర్షం వ్యక్తం చేసిన అభిమానులు
క్రికెట్ అభిమానుల కోసం చైన్నై సూపర్ లీగ్ సోషల్ మీడియాలో పేజీల్లో ఐపీఎల్ క్రికెట్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించింది. తద్వారా బహుమతుల పోటీలను నిర్వహించింది. పలువురు క్రికెట్ అభిమానులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సరైన సమాధానం చెప్పిన వారికి 25 ఐపీఎల్ టికెట్లను ఉచితంగా అందజేశారు. మరో 100 కన్సొలేషన్ ప్రైజ్ లను చెపాక్ సూపర్ లీగ్ టీమ్ అందజేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లను ఉచిత టికెట్లు పొందిన అభిమానులు ప్రత్యక్షంగా తిలకించారు. దీంతో మైదానంలో ఆనందంలో గంతులేశారు. ఓ క్రికెట్ అభిమాని భవేత్ రాజా మాట్లాడుతూ ధోనిని ప్రత్యక్షంగా చూడడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఉచిత టికెట్లు పొందడంపై అభిమానుల్లో ఆనందం
చైన్నైకి చెందిన మిథున్ రాజ్ చెపాక్ స్టేడియంలో రాత్రంతా నిరీక్షించినా టికెట్టు దొరకలేదని వాపోయారు. అయితే చెపాక్ సూపర్ లీగ్ నిర్వహించిన పోటీ ద్వారా ఉచిత టిక్కెట్ పొందానని వెల్లడించారు. దీంతో మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగిందని వివరించారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ముంబాయి ఇండియన్స్ 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన చైన్నై 17.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.