Sanju samson: సంజు శాంసన్‌ను తప్పించే నిర్ణయంపై స్పందించిన గంభీర్.. కారణాలపై క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ఇటీవల జట్టు నుంచి తప్పించడంపై వస్తున్న విమర్శలకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో సంజును జట్టు నుంచి తప్పించామని, అదే కారణంతో జింబాబ్వే సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదని ఆయన వెల్లడించాడు. ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించిన ఆటగాడిని ఇలా పక్కన పెట్టడం సరైందేనా అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
వివరాలు
మూడో టీ20లో భారత్ పరాజయం..
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ పరాజయం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. సంజు శాంసన్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదనే విషయాన్ని ఇప్పటికే అతనికి వ్యక్తిగతంగా వివరించినట్లు తెలిపారు. అయితే, ఆ సంభాషణ పూర్తిగా ప్రధాన కోచ్, ఆటగాడి మధ్య జరిగినదేనని, దాని వివరాలను బహిరంగంగా చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. సంజు విషయంలో జట్టు యాజమాన్యానికి పూర్తి స్పష్టత ఉందని గంభీర్ పేర్కొన్నారు. భారత జట్టు కోసం అతడు చేసిన సేవలను ఎవరూ విస్మరించరని, కానీ ప్రతి సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో ఆటగాడి ప్రస్తుత ఫామ్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
వివరాలు
మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు..
ప్రస్తుతం అవకాశం దక్కకపోయినా, సంజు మళ్లీ తన ఫామ్‌ను అందుకుని ఇదే సిరీస్‌లో తిరిగి జట్టులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌కు ముందు కూడా సంజు కష్టకాలాన్ని ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసిన గంభీర్, ఆ తర్వాత అదే టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో తన ప్రతిభను నిరూపించుకున్నాడని కొనియాడారు. జట్టు ఎంపికపై స్పందిస్తూ గంభీర్ మరో కీలక వ్యాఖ్య చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తుది జట్టులో ఎవరు ఆడుతున్నారన్నది కంటే జట్టు విజయం సాధించిందా లేదా అన్నదే ముఖ్యమని అన్నారు. భారత జట్టుకు ఆడే అర్హత ఉన్న ప్రతి ఆటగాడికీ అవకాశం లభిస్తుందని, అయితే పరిస్థితులకు అనుగుణంగా అత్యుత్తమ జట్టును ఎంపిక చేయడం కోచింగ్ సిబ్బంది బాధ్యత అని చెప్పారు.