LOADING...
IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు గంభీర్ కీలక నిర్ణయం
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు గంభీర్ కీలక నిర్ణయం

IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ముందు గంభీర్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025లో భారత్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‌లపై ఘన విజయాలు సాధించిన భారత జట్టు, సూపర్-4లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సూపర్-4లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మళ్లీ విజయం సాధించి, ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. ఇక సూపర్-4లో భారత్ ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో పోటీ చేయనుంది. సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, ఫైనల్‌లో స్థానం ఖాయమవుతుంది. ఈ మ్యాచ్ కోసం కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేయవచ్చనే అవకాశం ఉంది.

Details

ఒక్క వికెట్ కూడా తీయని బూమ్రా

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిభ చూపలేకపోయాడు. 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం, లీగ్ దశలో మూడు మ్యాచ్‌లలో 11 ఓవర్లు బౌలింగ్ చేసి 92 పరుగులు ఇచ్చి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ పరిస్థితిలో బుమ్రా స్థానంలో టీ20 బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించే అవకాశం ఉంది. బాకీ ప్లేయర్స్ పాకిస్తాన్‌పై ఆడిన విధంగానే కొనసాగించనున్నారు. బ్యాటింగ్‌లో టీమిండియాకు శక్తివంతమైన ఫార్మ్ ఉంది. ముందుగా విఫలమైన శుభ్‌మన్ గిల్ కూడా ఇటీవల మంచి ఫార్మ్‌లో ఉన్నాడు.

Details

భారత్ తుది అంచనా జట్టు

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్) హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.