Page Loader
Sourav Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీకి మరోసారి గంగూలీ ఛైర్మన్‌గా ఎంపిక
ఐసీసీ క్రికెట్ కమిటీకి మరోసారి గంగూలీ ఛైర్మన్‌గా ఎంపిక

Sourav Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీకి మరోసారి గంగూలీ ఛైర్మన్‌గా ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ మళ్లీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 2021లో అనిల్ కుంబ్లే స్థానంలో బాధ్యతలు స్వీకరించిన గంగూలీ, మరోసారి అదే పదవిలో కొనసాగనున్నారు. కమిటీలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సభ్యుడిగా కొనసాగనున్నాడు. ఇతర సభ్యులుగా వెస్టిండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్, అఫ్గానిస్థాన్‌కు చెందిన హమిద్ హసన్, దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ ఉన్నారు. ఇదిలా ఉండగా మహిళల క్రికెట్ కమిటీలో న్యూజిలాండ్‌కు చెందిన కేథరిన్ క్యాంప్‌బెల్ అధ్యక్షత వహిస్తుండగా, ఆస్ట్రేలియాకు చెందిన అవ్రిల్ ఫహే, దక్షిణాఫ్రికా‌కు చెందిన మొసెకి సభ్యులుగా ఉన్నారు.

Details

అఫ్గాన్ యువతులకు మద్దతుగా ఐసీసీ

అఫ్గాన్ మహిళా క్రికెటర్ల భవితవ్యంపై ఐసీసీ కీలక చర్య తీసుకుంది. తాలిబన్ల పాలన ప్రారంభమైన తర్వాత తీవ్రంగా ప్రభావితమైన అఫ్గాన్ మహిళా క్రికెట్‌కు పునరుజ్జీవనం కలిగించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. తాలిబన్ పరిపాలనలో మహిళలు క్రీడల్లో పాల్గొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అఫ్గాన్ మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లి క్రికెట్‌ ఆడుతున్నారు. ఇలాంటి ఆటగాళ్లతో పాటు క్రికెట్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే అఫ్గాన్ యువతులకు మద్దతుగా ఐసీసీ ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ చర్యకు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు పూర్తి సహకారం అందించనున్నట్లు సమాచారం.