LOADING...
ఢిల్లీ ఓటములపై స్పందించిన గంగూలీ.. ఏమన్నాడో తెలుసా?
ఢిల్లీ ఓటములపై మాట్లాడిన సౌరబ్ గంగూలీ

ఢిల్లీ ఓటములపై స్పందించిన గంగూలీ.. ఏమన్నాడో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2023
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ప్రతి సీజన్లో ప్రత్యర్థుల గట్టి పోటినిచ్చే ఢిల్లీ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌లోనూ అపజయాలను మూటకట్టుకుంది. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గట్టి పోటిని ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాణిస్తున్నా.. మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ ఢిల్లీ వరుస ఓటములపై స్పందించాడు.

సౌరబ్ గంగూలీ

బ్యాటింగ్ విభాగంలో ఢిల్లీ జట్టు రాణించాలి: సౌరబ్ గంగూలీ

ఢిల్లీ జట్టు నిండా కుర్రాళ్లు ఉన్నారని, వాళ్లు రాణించడానికి కొంచెం సమయం పడుతుందని, ఓడిపోతే బాధ కలుగుతుందని, కానీ ఆటలో గెలుపు ఓటములు సహజమని, వచ్చే మ్యాచ్ ల్లో ఢిల్లీ ఆటగాళ్లు పుంజుకొని విజయాలను సాధిస్తారని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ జట్టు బ్యాటింగ్ విభాగంలో రాణిస్తేనే ఫలితాలు మారే అవకాశం ఉంటుందన్నారు. గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.