Page Loader
ఫుట్‌బాల్‌కు ప్రముఖ ప్లేయర్ వీడ్కోలు
ఫుట్ బాల్‌కు వీడ్కోలు పలికిన గారెత్ బేల్

ఫుట్‌బాల్‌కు ప్రముఖ ప్లేయర్ వీడ్కోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2023
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేల్స్ కు చెందిన అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్లలో ఒకరైన గారెత్ బేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని వెల్లడించారు. జాగ్రత్తగా, ఆలోచనత్మకంగా పరిశీలించిన తర్వాతే నుంచి ఫుట్ బాల్ నుండి రిటైర్మెంట్ ను ప్రకటిస్తున్నానని గారెత్ బేల్ చెప్పారు. తాను ఇష్టపడే క్రీడ నుంచి తన కలను సాధించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబం, కోచ్‌లకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 2006లో సౌతాంప్టన్‌తో బేల్ అరంగేట్రం చేశాడు. 2012-13 సీజన్‌లో మొత్తం 26 గోల్స్ చేశాడు.

గారెత్ బేల్

గారెత్ బేల్ రికార్డులివే..

మొత్తంగా, బేల్ రియల్ కోసం 258 సార్లు ఆడాడు, 106 సార్లు స్కోర్ చేశాడు. 176 లా లిగా గేమ్‌లలో, ఆయన 81 గోల్స్ సాధించాడు. 57 ఛాంపియన్స్ లీగ్ గేమ్‌లలో, 16 సార్లు స్కోర్ చేశాడు. గత ఏడాది జూన్‌లో క్లబ్‌తో తన అనుబంధాన్ని ముగించాడు. గతేడాది జూన్‌లో రియల్ మాడ్రిడ్‌తో తన అనుబంధాన్ని ముగించిన తర్వాత, బాలే లాస్ ఏంజిల్స్ FCతో కొంతకాలం పనిచేశాడు. 13 గేమ్‌లలో క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. బేల్ చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో ఖతార్ ప్రపంచ కప్ 2022లో ఇంగ్లాండ్‌తో 3-0 తేడాతో ఓడిపోయింది