Loading...
Sunil Gavaskar: టీమిండియా సెలక్షన్‌పై గవాస్కర్ అసహనం.. ఆ ఇద్దరినీ ఎలా వదిలేశారు?
టీమిండియా సెలక్షన్‌పై గవాస్కర్ అసహనం.. ఆ ఇద్దరినీ ఎలా వదిలేశారు?

Sunil Gavaskar: టీమిండియా సెలక్షన్‌పై గవాస్కర్ అసహనం.. ఆ ఇద్దరినీ ఎలా వదిలేశారు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టు ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌లను పక్కన పెట్టడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ వేదికగా ప్రారంభమైన ఈ నిర్ణయాత్మక టెస్టులో టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తుది జట్టులో కీలక ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు

జడేజా, సిరాజ్‌లను ఎలా తప్పించారు?

ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో ఉన్నాడని సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు.

బ్యాటింగ్‌కు అనుకూలమైన ఫ్లాట్ పిచ్‌లపై కూడా బంతిని అద్భుతంగా టర్న్ చేస్తూ వికెట్లు తీయగల సామర్థ్యం జడేజాకు ఉందని పేర్కొన్నాడు.

ముఖ్యంగా టెస్టు మ్యాచ్ నాలుగు, ఐదో రోజుల్లో జడేజా స్పిన్ జట్టుకు ఎంతో ఉపయోగపడేదని అభిప్రాయపడ్డాడు.

మరోవైపు మహమ్మద్ సిరాజ్ కూడా ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడని తెలిపాడు.

అలాంటి ఆటగాడికి తుది జట్టులో చోటు దక్కకపోవడం దురదృష్టకరమన్నాడు. అయితే జట్టు ఎంపిక పూర్తయిన తర్వాత దానిని సమర్థించాల్సిందేనని గవాస్కర్ స్పష్టం చేశాడు.

వివరాలు

సిరాజ్ లేకపోవడం కలిసొచ్చింది!

ఎంపికైన ఆటగాళ్లు అద్భుతంగా రాణించి భారత్‌కు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

మరోవైపు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కాటీ మార్టిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హ్యాగ్లీ ఓవల్ పచ్చిక పిచ్‌పై మహమ్మద్ సిరాజ్ ఆడకపోవడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు.

భారత పేస్ దళంలో సిరాజ్ కీలక బౌలర్ కావడంతో అతడు లేకపోవడం తమ జట్టుకు ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నాడు.

ADVERTISEMENT

వివరాలు

గుర్నూర్ బ్రార్‌కు టెస్టుల్లో అరంగేట్రం

ఈ రెండో టెస్టు కోసం భారత తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. తొలి టెస్టులో ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో 26 ఏళ్ల యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు అవకాశం కల్పించారు.

అతడికి టెస్టు క్యాప్ అందించి అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయించారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ఆరంభంలో భారత పేసర్లను సమర్థంగా ఎదుర్కొంది.

వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ మంచి ఆరంభాన్ని అందుకుంది. దీంతో రెండో టెస్టులో భారత జట్టు ఎంపికతో పాటు గుర్నూర్ బ్రార్ అరంగేట్రంపైనా ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT