ఆస్ట్రేలియా సెలెక్టర్లు రాజీనామా చేయాలన్న గవాస్కర్
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వివాదంగా మారుతోంది. పిచ్‌పై విమర్శలు రోజు రోజుకు ఎక్కువతున్నాయి. ముఖ్యంగా ఆసీస్ మాజీ క్రికెటర్లు టీమిండియా నాగ్‌పూర్‌ను పిచ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పిచ్‌లే కాకుండా పలువురు ఆస్ట్రేలియా మాజీలు చాలా విషయాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన స్పందనను తెలియజేశారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు సెలెక్టర్లను ప్రశ్నించాలని, హెజిల్ వుడ్, స్టార్క్, కామెరూన్ గ్రీన్ తొలి రెండు అందుబాటులో ఉండరని తెలిసినప్పుడు ఎలా జట్టులోకి ఎంపిక చేశారని, సగం సిరీస్ వరకు 12 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారని గవాస్కర్ మండిపడ్డాడు.
మార్చి 9న నాలుగో టెస్టు ప్రారంభం
స్పిన్నర్ కునేమన్ ఎంపికపై కూడా ఆస్ట్రేలియా సెలక్టర్లను గవాస్కర్ ప్రశ్నించారు. జట్టులో కొత్తగా వచ్చిన కునేమన్ లాంటి ఆటగాడు ఉన్నప్పుడు అతడిని ఎందుకు ఎంచుకున్నారని, టీమ్ మేనేజ్ మెంట్ 12 మంది ఆటగాళ్లలో 11 మందిని ఎంపిక చేసిందని, ఒకవేళ ఆస్ట్రేలియా చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సమం చేసినప్పటికీ సెలక్టర్లకు బాధ్యత ఉంటే రాజీనామా చేయాలని గవాస్కర్ స్పష్టం చేశారు. అయితే ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ పిచ్‌పై ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభించడంతో బోర్డర్ గవాస్కర్‌లో ట్రోఫీలో 2-1తో టీమిండియా ముందంజలో ఉంది. మార్చి 9న ఆహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.