IND vs AUS: భారత ఓటమిపై గవాస్కర్ అసక్తికర కామెంట్స్
స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో ఓడిపోవడం చాలా అరుదైన విషయం. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మూడో టెస్టులో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్‌కే ముగిసింది. దీంతో టీమిండియా టెస్టు చరిత్రలో అత్యంత ఘోర పరాజయాల్లో ఇండోర్ టెస్టు కూడా ఒకటి నిలిచిపోనుంది. తాజాగా ఈ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ ఔటవ్వాలనే ఆలోచనతోనే బ్యాటింగ్ చేశారని గవాస్కర్ పేర్కొన్నారు. భారీ షాట్స్ ఆడలేక ఓటమిపాలయ్యారని విమర్శించారు.
జడేజా వేసిన నోబాల్ భారత్ కొంపముంచింది
మూడో టెస్టులో టీమ్ ఇండియా ఒత్తిడికి గురైందని, దీంతో 109 పరుగులకే ఆలౌటైందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఓపికతో ఆడి ఉంటే పరుగులు చేయడం సాధ్యమేనని పుజారాతో పాటు ట్రావిస్ హెడ్, లబుషేన్ నిరూపించారన్నారు. అదే విధంగా జడేజా విసిరిన నోబాల్ భారత్ కొంపముంచిందని గవాస్కర్ చెప్పారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో లబుషన్ ఖాతా తెరవకుండానే జడేజా బౌలింగ్‌లో అవుటైనా.. అది నోబాల్ అని తేలడంతో లబుషేన్ బతికిపోయాడని, ఇక్కడే భారత ఓటమికి బీజం పడిందన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 109, రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులకు ఆలౌటైనా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.