జడేజా, అశ్విన్ సమక్షంలో స్వదేశంలో భారత్ రెండు టెస్టు ఓటములు
భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ 2-1తో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముందంజలో ఉంది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఆసీస్ అద్భుత ప్రదర్శన కనభరిచింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో కలిసి స్వదేశంలో ఇంతవరకూ భారత్ రెండు టెస్టులను ఓడిపోవడం గమనార్హం. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మాథ్యూ కుహ్నెమాన్ (5/16) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత జట్టు 109 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లియాన్ 8/64 విజృంభించడంతో భారత్ 163 పరుగులకే ఆలౌటైంది.
9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేయడంతో భారత్ 76 పరుగుల అధిక్యాన్ని సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసింది. ట్రావిస్ హెడ్ 49 పరుగులతో రాణించాడు. అశ్విన్, జడేజాలు దశాబ్ద కాలంగా స్వదేశంలో టెస్టుల్లో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి డిసెంబర్ 2012లో ఇంగ్లండ్‌పై తొలిసారిగా ఆడారు. ఈ మ్యాచ్‌లో జడేజా టెస్టు అరంగ్రేటం చేశాడు. వీరిద్దరూ కలిసి సొంతగడ్డపై 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఆడినప్పుడు మాత్రమే ఇండియా మొదటి సారిగా ఓటమిపాలైంది.