రవీంద్ర జడేజా నోబాల్స్‌పై గవాస్కర్ సీరియస్
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియాకు కీలకమైన ఆటగాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. 2022 ఏడాది చివరి భాగంలో మోకాలి శస్త్రచికిత్స కారణంగా టీమిండియాకు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న తర్వాత జడేజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరుపున ఆడాడు. ఓ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి జడేజా సత్తా చాటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా వికెట్లు తీసి, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుతం జడేజా అంతర్జాతీయ క్రికెట్‌కు పునరాగమనం చేసిన తర్వాత ఫ్రంట్ ఫుట్ నో-బాల్స్ వేయడం ఇబ్బందిగా మారుతోంది. దీనిపై తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.
స్పిన్నర్స్ నోబాల్స్ వేయడం తగదు
బుధవారం జరిగిన మ్యాచ్‌లో జడేజా మరోసారి నో బాల్స్ వేశాడు. మొదటి నోబాల్ తో సమస్య లేకపోయినా రెండోసారి నోబాల్ వేయడంతో మార్నస్ లాబుస్‌చాగ్నే బతికిపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను జడేజా తీసుకున్నాడని, కానీ స్పిన్నర్స్ నోబాల్స్ వేయడం వల్ల భారత్‌కు నష్టం వాటిల్లుతుందని, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తో జడేజా కుర్చోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. అంతకుముందు, లెఫ్టార్మ్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ టెస్ట్ క్రికెట్‌లో మొదటిసారిగా ఐదు వికెట్ల (5/16) వికెట్లను తీశాడు.