India Playing XI: గిల్, సుందర్‌కు వేటు.. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌కు టీమిండియా తుది జట్టు ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
సౌతాఫ్రికాపై కీలకమైన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా నిరాశతో ప్రారంభించింది. కోల్‌కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో భారత బ్యాటింగ్ ఘోరంగా విఫలమవడంతో, సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రోటియాస్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Details
రెండో టెస్ట్‌పై భారీ అంచనాలు
రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ నవంబర్ 22న (శనివారం) గౌహతిలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని టీమిండియా సిద్ధమవుతోంది. మరోవైపు, తొలి టెస్ట్‌లో చూపిన అద్భుత ప్రదర్శనను పునరావృతం చేసి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని సౌతాఫ్రికా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్‌పై అభిమానులకు భారీ ఆసక్తి నెలకొంది. భారత జట్టులో పెద్ద మార్పులే..? తొలి టెస్ట్‌లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్‌కు ఊహించినంత ఫలితం రాలేదు. దీంతో రెండో టెస్ట్ కాంబినేషన్‌లో మార్పులు చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది.
Details
శుభ్‌మన్ గిల్
మెడ నొప్పితో ఆసుపత్రి చేరిన గిల్ రెండో టెస్ట్ ఆడటం అనుమానంగా ఉంది. పూర్తిగా కోలుకున్నా కూడా జట్టు నిర్వహణ ముందస్తు జాగ్రత్తగా విశ్రాంతి ఇవ్వనుంది. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. వాషింగ్టన్ సుందర్ నాలుగో స్పిన్నర్‌గా ఆడిన సుందర్ స్థానంలో మార్పు జరిగే అవకాశం ఉంది. స్పిన్నర్‌ను కొనసాగించాలని నిర్ణయిస్తే అక్షర్ పటేల్‌పై వేటు పడే అవకాశం కూడా ఉంది. నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా అతనికి రీఏంట్రీ ఇవ్వాలని జట్టు భావిస్తుంది. స్పిన్నర్లతోనే కొనసాగాలనుకుంటే, గిల్ స్థానంలో సాయి సుదర్శన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
Details
బ్యాటర్లే బాధ్యత తీసుకోవాలి
తొలి టెస్ట్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అస్సలు రాణించలేదు. రెండో టెస్ట్‌లో మంచి ఆరంభం ఇవ్వడం వారి బాధ్యత. రిషభ్ పంత్, జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్‌లో సత్తా చూపాలి. మొదటి టెస్ట్‌లో భారత బౌలర్లు బాగా పోరాడారు. అసలు సమస్య బ్యాటింగ్ విఫలమవడమే. రెండో టెస్ట్‌కు భారత అంచనా తుది జట్టు యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ / వాషింగ్టన్ సుందర్ శుభ్‌మన్ గిల్ / దేవదత్ పడిక్కల్ రిషభ్ పంత్ రవీండ్ర జడేజా ధ్రువ్ జురెల్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్‌ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్