
IND vs ENG: క్రాలీకి 'ఆస్కార్' ఇవ్వండి బాబోయ్.. చప్పట్లతో సమాధానం ఇచ్చిన టీమిండియా ప్లేయర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఉత్కంఠభరితంగా, ఉద్వేగాల నడుమ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు సమానంగా 387 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా సమాంతరంగా సాగింది. అయితే మూడో రోజు చివరి సెషన్‌లో అసలు హంగామా మొదలైంది. భారత జట్టు 145/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించి చివరకు 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో అదే స్కోరు నమోదు చేయడంతో ఎవరికీ లీడ్ దక్కలేదు. దీనితో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఇక్కడే డ్రమా ప్రారంభమైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభ సమయంలో జస్పిత్ బుమ్రా బౌలింగ్‌కు రాగా, జాక్ క్రాలీ, బెన్ డకెట్ వ్యూహాత్మక ఆలస్యాలకు పాల్పడ్డారు.
Details
తీవ్రంగా స్పందించిన గిల్
బుమ్రా రన్నప్‌లోకి వస్తుండగానే క్రాలీ ఆగిపోవడం, గాయానికి ఫిజియోను పిలవడం వంటి చర్యలు మ్యాచ్‌ను ఆలస్యం చేసేలా ఉండటంతో భారత ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యలపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా స్పందించాడు. జాక్ క్రాలీ వైపు దూసుకెళ్లేలా ప్రవర్తించిన గిల్‌కు మద్దతుగా పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు. మిగిలిన భారత ఆటగాళ్లు కూడా చప్పట్లు కొడుతూ, మాటలతో క్రాలీని డిస్టర్బ్ చేయడానికి యత్నించారు. కానీ జాక్ క్రాలీ మాత్రం బుమ్రా వేసిన ఓవర్‌ను చాలా ఆచితూచి ఆడుతూ ముగించాడు. వెంటనే అంపైర్లు పరిస్థితిని నియంత్రించేందుకు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.