AUS vs ENG : టెస్టుల్లో లియోన్ సరికొత్త చరిత్ర.. మెక్‌గ్రాత్‌ను దాటేసిన ఆసీస్ స్పిన్నర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్ బౌలర్ నాథన్ లియోన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచి కొత్త రికార్డు సృష్టించాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో లియోన్ ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డును లియోన్ అధిగమించాడు. మెక్‌గ్రాత్ 124టెస్టుల్లో 563వికెట్లు సాధించగా,లియోన్ 141 టెస్టుల్లో 564 వికెట్లు తీసి అతడిని వెనక్కు నెట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ల జాబితాలో దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
వివరాలు
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్లు వీరే..
షేన్ వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్ వార్న్ - 708 వికెట్లు నాథన్ లియోన్ - 564 వికెట్లు గ్లెన్ మెక్‌గ్రాత్ - 563 వికెట్లు మిచెల్ స్టార్క్ - 420 వికెట్లు డెన్నిస్ లిల్లీ - 355 వికెట్లు ఆరో స్థానంలో.. ఇక మొత్తం టెస్టు క్రికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాథన్ లియోన్ ఆరో స్థానంలో నిలిచాడు. అతడికన్నా ముందు షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, అనిల్ కుంబ్లే, స్టువార్ట్ బ్రాడ్ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారు.
వివరాలు
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
ముత్తయ్య మురళీధరన్ - 800 వికెట్లు షేన్ వార్న్ - 708 వికెట్లు జేమ్స్ అండర్సన్ - 704 వికెట్లు అనిల్ కుంబ్లే - 619 వికెట్లు స్టువర్ట్ బ్రాడ్ - 604 వికెట్లు నాథన్ లియోన్ - 564 వికెట్లు ఇదిలా ఉండగా, లియోన్ తన రికార్డును బ్రేక్ చేసిన సందర్భంలో గ్లెన్ మెక్‌గ్రాత్ కామెంటరీ బాక్స్‌లోనే ఉన్నాడు. నాథన్ లియోన్ వికెట్ తీయగానే మెక్‌గ్రాత్ సరదాగా తన పక్కన ఉన్న కుర్చీని లేచి విసిరినట్టుగా నటించాడు. ఆ వెంటనే లియోన్‌ను అభినందిస్తూ స్పందించాడు. మెక్‌గ్రాత్ ఈ సరదా రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుర్చీ లేపిన గ్లెన్ మెక్‌గ్రాత్
Glenn McGrath's reaction to Nathan Lyon passing him on the all-time Test wickets list was absolutely hilarious 🤣 #Ashes pic.twitter.com/1jTM06M8me
— cricket.com.au (@cricketcomau) December 18, 2025