FIFA World Cup 2026: అర్జెంటీనాపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం.. వరల్డ్‌కప్ నుంచి తొలగించాలంటూ 75 లక్షల మంది పిటిషన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందే అర్జెంటీనా జట్టుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిఫరీలు అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆగ్రహానికి దారితీశాయి. ఓ అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి తప్పించాలని కోరుతూ దాదాపు 75 లక్షల మంది ఫుట్‌బాల్ అభిమానులు సంతకం చేసిన ఆన్‌లైన్ పిటిషన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వివరాలు
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌పై వివాదం
క్వార్టర్ ఫైనల్లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో రిఫరీ అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరించాడని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలోనే పిటిషన్‌కు భారీగా మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టులో.. "లియోనెల్ మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనాకు ఫిఫా, రిఫరీలు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు.
విజేతను ముందే నిర్ణయిస్తే మిగతా జట్లు ఎందుకు పోటీపడాలి? అందుకే అర్జెంటీనాను టోర్నీ నుంచి తప్పించి, అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.
వివరాలు
అర్ధరాత్రి సెమీఫైనల్ సమరం
ఇవాళ అర్ధరాత్రి ఇంగ్లాండ్, అర్జెంటీనా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్లో ఇప్పటికే ఫైనల్ చేరిన స్పెయిన్‌ను ఢీకొంటుంది.
మెస్సిని అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యూహం
టోర్నీ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ బలమైన ప్రత్యర్థులను ఓడిస్తూ సెమీఫైనల్‌కు చేరుకుంది.
కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ సహా పలువురు ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఇప్పుడు అర్జెంటీనాను ఓడించి ఫైనల్‌కు చేరుకోవాలంటే లియోనెల్ మెస్సిని నియంత్రించడం అత్యంత కీలకమని ఇంగ్లాండ్ మేనేజర్ థామస్ టుచెల్ అభిప్రాయపడ్డాడు.
వివరాలు
మెస్సి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశాం
మ్యాచ్‌కు ముందు మాట్లాడిన టుచెల్.. "లియోనెల్ మెస్సిని ఎలా అడ్డుకోవాలన్న దానిపై పలు వ్యూహాలు సిద్ధం చేశాం.
పాత పద్ధతులను కూడా పరిశీలిస్తున్నాం. మైదానంలో మెస్సి చాలా వేగంగా కదులుతాడు. అతను బంతిని ఎక్కడికి పంపిస్తాడో అంచనా వేయగలం.
కానీ ఇతరుల కంటే ముందుగానే పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకునే సామర్థ్యం అతనికి ఉంది. అందుకే అతన్ని నిలువరించడం అంత సులభం కాదని వ్యాఖ్యానించాడు.