Loading...
Deepthi Jeevanji: లక్ష్య అథ్లెట్‌ దీప్తి జివాంజికి స్వర్ణం.. భారత్‌ ఖాతాలో మరో 11 పతకాలు!
లక్ష్య అథ్లెట్‌ దీప్తి జివాంజికి స్వర్ణం.. భారత్‌ ఖాతాలో మరో 11 పతకాలు!

Deepthi Jeevanji: లక్ష్య అథ్లెట్‌ దీప్తి జివాంజికి స్వర్ణం.. భారత్‌ ఖాతాలో మరో 11 పతకాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

పారా ఆసియా క్రీడల్లో రెండో రోజు కూడా భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. వరుసగా పతకాలు సాధిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. తాజాగా భారత్‌ ఖాతాలో మరో 11 పతకాలు చేరాయి. దీంతో ప్రస్తుతం భారత్‌ మొత్తం 22 పతకాలతో పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి. 'లక్ష్య' అథ్లెట్‌ జీవాంజి దీప్తి స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో ఆమె పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ రేసును కేవలం 56.36 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 56.59 సెకన్లతో దీప్తి పేరిటే ఈ రికార్డు ఉండేది.

వివరాలు

జావెలిన్‌ త్రోలో భారత్‌కు రెండు పతకాలు

తాజాగా తన రికార్డును తానే అధిగమించి స్వర్ణం సాధించింది.

ఈ విభాగంలో జపాన్‌కు చెందిన కన్నావో నినా 58.92 సెకన్లతో రజత పతకం గెలుచుకోగా.. కటో అకానె 1 నిమిషం 0.26 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌53/54 ఫైనల్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. ఈ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి.

ప్రదీప్‌ కుమార్‌ 27.45 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజత పతకాన్ని సాధించాడు. మరో భారత అథ్లెట్‌ ఆయుష్‌ వర్మ 17.88 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

వివరాలు

ఇవిగో భారత్‌ సాధించిన కాంస్య పతకాలు

ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలోనూ భారత్‌కు రజత పతకం దక్కింది. భారత షూటర్‌ మనీష్‌ నర్వాల్‌ 233.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు.

మహిళల క్లాస్‌ 3 టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత క్రీడాకారిణి సోనాల్‌బెన్‌ పటేల్‌ కాంస్య పతకాన్ని సాధించింది. సెమీఫైనల్‌లో దక్షిణ కొరియాకు చెందిన యూన్‌ జియు చేతిలో ఓటమి పాలవడంతో ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది.

భారత పతాకధారి భవినా పటేల్‌ కూడా మహిళల క్లాస్‌ 4-5 టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

పురుషుల ఎఫ్‌11 షాట్‌పుట్‌ విభాగంలో ప్రవీణ్‌ శర్మ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌ ఖాతాలో స్వర్ణం, రజతం

తన ఆరో ప్రయత్నంలో 13.86 మీటర్ల దూరం షాట్‌పుట్‌ను విసిరి పతకాన్ని అందుకున్నాడు.

మహిళల స్టాండింగ్‌ పారా టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌కు మరో రెండు కాంస్య పతకాలు లభించాయి.

సెమీఫైనల్‌లో చైనా క్రీడాకారిణి మావో జింగ్‌దిన్‌ చేతిలో బేబీ సహానా ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

మరో భారత క్రీడాకారిణి ప్రాచి పాండే కూడా కాంస్య పతకాన్ని సాధించింది. సెమీఫైనల్‌లో ఇరాక్‌ క్రీడాకారిణి నజల్లా చేతిలో ఆమె ఓటమి చవిచూసింది.

ఇలా రెండో రోజు కూడా భారత పారా అథ్లెట్లు పతకాల వేటలో దూసుకెళ్తూ భారత్‌ ఖాతాలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను చేర్చారు.

ADVERTISEMENT