
Asian Games 2023 : ఆర్చరీలో పురుషుల జట్టుకు గోల్డ్.. స్క్వాష్‌లో సౌరభ్‌కు రజతం
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ప్లేయర్లు ఇవాళ మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు.
ఈ రోజు ఉదయం మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం స్వర్ణం సాధించగా, తాజాగా అదే విభాగంలో పురుషుల జట్టు కూడా పసిడి పతకాన్ని ముద్దాడింది.
పురుషుల టీమ్ కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్‌లో భారత త్రయం ఓజాస్ ప్రవీణ్, అభిషేక్ శర్మ, ప్రథమేష్ సమాధాన్‌లు కొరియాను చిత్తు చేశారు.
235-230తో కొరియాను ఓడించి స్వర్ణం సాధించారు.
Details
రెజ్లింగ్ లో భారత్ కు మరో పతకం
ఇక సీనియర్ స్క్వాష్ ప్లేయర్ సౌరభ్ ఘోషల్ పురుషుల సింగిల్స్ తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఫైనల్‌లో యియాన్ వో (మలేషియా) చేతిలో 11-9, 9-11, 5-11, 7-11 తేడాతో ఓటమిపాలయ్యాడు.
తొలి గేమ్‌లో విజయం సాధించిన సౌరభ్, తర్వాత వరుసగా మూడు గేమ్‌ల్లో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నాడు.
మరోవైపు రెజ్లింగ్‌లో భారత్ కు మరో కాంస్య పతకం దక్కింది.
మహిళల 53 కిలోల విభాగంలో అంతిమ్ పాంగల్, బ్యాట్ ఓచిర్ బోలోర్టుయాను 3-1 తేడాతో ఓడించింది.