ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు భలే ఛాన్స్ : సౌరబ్ గంగూలీ
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని ఫ్రాంచేజీలకు గాయం కారణంగా స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. వారి స్థానంలో యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తే టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. ఈ ఆటగాళ్లు లేకపోవడం ఐపీఎల్ ఆడకపోవడం దురదృష్టకరం. చాలా ఫ్రాంచేజీలు మ్యాచ్ విన్నర్లను కోల్పోవడంతో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో అద్భుతఫామ్‌లో ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు సౌరబ్ గంగూలీ స్పందించాడు.
యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుకోవాలి
ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ను కోల్పోవడం బాధాకరమని, అతని స్థానంలో ఓ యువ క్రికెట్ రాణిస్తే అవకాశం ఉందని, దాన్ని యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సౌరబ్ గంగూలీ చెప్పారు. ఎంఎస్ ధోని ఫామ్ లో కోల్పోయినప్పుడు నుంచి రిషబ్ పంత్ మెరుగయ్యాడని, ఇలాంటి అవకాశమే శుభ్‌మాన్ గిల్, రుతుర్వాజ్ గైక్వాడ్ కు వచ్చిందని, వాళ్లు తమ ప్రతిభను చాటుకోవాలని, అయితే రిషబ్ కోలుకోవడం చాలా ముఖ్యమని వివరించారు. మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ వీక్షించడానికి ఆరుణ్ జైట్లీ స్టేడియానికి రిషబ్ పంత్ హాజరుకానున్నారు.