LOADING...
Asia Cup 2025 : క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసియా కప్ టీమిండియా జట్టు ప్రకటన ఆ రోజే!
క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసియా కప్ టీమిండియా జట్టు ప్రకటన ఆ రోజే!

Asia Cup 2025 : క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆసియా కప్ టీమిండియా జట్టు ప్రకటన ఆ రోజే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టు ఎప్పుడు ప్రకటించబడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో జరగనున్న ఈ టోర్నమెంట్‌ టీ20 ఫార్మాట్‌లో కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ 17 మంది సభ్యులతో కూడిన జట్టును త్వరలో ప్రకటించనుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో రెండు గ్రూపులుగా విభజన జరగనుంది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండగా, ఆగస్టు 14న ఈ రెండు జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. భారత్ గ్రూప్-ఎలో యూఏఈ, పాకిస్థాన్, ఒమన్ జట్లతో తలపడనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో భారత్ తన మ్యాచ్‌లను ఆడుతుంది.

Details

ఆగస్టు మూడో వారంలో ప్రకటన

బీసీసీఐ జట్టు ప్రకటన ఆగస్టు మూడవ వారంలో వెలువడే అవకాశముంది. ఆగస్టు 19 లేదా 20న ముంబైలో జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశంలో జట్టు తుది ఎంపిక జరుగుతుంది. ఈ సమావేశానికి జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ హాజరుకానున్నారు. అనంతరం అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్క్వాడ్ వివరాలు వెల్లడిస్తారు. అయితే స్పోర్ట్స్ టాక్, సోషల్ మీడియా వర్గాల ప్రకారం, ఆగస్టు 16 లేదా 17న కూడా ప్రకటన జరిగే అవకాశం ఉందని సూచించబడింది. ప్రస్తుతం కొందరు ఆటగాళ్లు బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేస్తున్నారు. వీరి ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చిన వెంటనే జట్టు ఫైనల్ అవుతుందని సమాచారం.

Details

దుబాయ్, అబుదాబి వేదికలుగా మ్యాచులు

కాబట్టి, వచ్చే వారం రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌ 2026 టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా భావించబడుతోంది. యూఏఈలోని దుబాయ్, అబుదాబి వేదికలుగా ఉండనున్నాయి. ఈసారి శుభ్‌మన్ గిల్‌కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గత సంవత్సరం నుంచి టి20 ఫార్మాట్‌లో ఆడని గిల్, కేవలం టెస్టులు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా మెప్పించిన గిల్, ఆసియా కప్ 2025లో వైస్ కెప్టెన్‌గా రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూర్యకుమార్ యాదవ్‌కి డిప్యూటీగా వ్యవహరించనున్నారు.