
IPL 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కోల్‌కతాలో తొలి మ్యాచ్‌కి వర్షం ముప్పు లేదంట!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.
ఇవాళ రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంటుందని భావించిన అభిమానులకు శుభవార్త అందింది.
తాజా నివేదిక ప్రకారం మ్యాచ్ సమయానికి వర్షం ముప్పు ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది.
Details
వర్షం ముప్పు తక్కువే
సాయంత్రం 4-5 గంటల వరకు
కోల్‌కతాలో పొడి వాతావరణం కొనసాగుతుందని అంచనా. కాస్త మబ్బులు కనిపించినా, వర్షం పడే అవకాశం తక్కువే.
సాయంత్రం 6 గంటలకు
మబ్బులు మరింత పెరిగే సూచనలు ఉన్నా, వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువ. ఈ సమయంలో ఐపీఎల్ 18వ సీజన్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి.
రాత్రి 7 గంటలకు: మ్యాచ్ టాస్ పడే సమయం. అప్పటికి కూడా వర్షం లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే, గాలి నాణ్యత మాత్రం అనారోగ్యకరంగా ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
Details
రాత్రి 12 గంటల వరకు
మ్యాచ్ పూర్తయ్యేంతసేపు వాతావరణం పొడిగా ఉంటుందని 'ఆక్యూ వెదర్' అంచనా వేస్తోంది. తేమ శాతం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి వర్షం ఆటంకం లేకుండా ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.