LOADING...
Hardik Pandya: ముంబయి ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. జట్టులో చేరిన హార్దిక్ పాండ్య
ముంబయి ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. జట్టులో చేరిన హార్దిక్ పాండ్య

Hardik Pandya: ముంబయి ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. జట్టులో చేరిన హార్దిక్ పాండ్య

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భాగంగా మే 10న జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబయి ఇండియన్స్ (RCB vs MI) మ్యాచ్‌కు ముందు ముంబయి అభిమానులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌కు దూరమవుతాడన్న ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతం అతడు బెంగళూరుతో జరిగే కీలక పోరుకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ ఇప్పటికే రాయ్‌పూర్ చేరుకుని జట్టుతో కలిసిపోయాడని ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై వస్తున్న సందేహాలకు చెక్ పడినట్టైంది. వెన్ను నొప్పి కారణంగా లఖ్‌నవూతో జరిగిన గత మ్యాచ్‌కు పాండ్య దూరమైన విషయం తెలిసిందే.

వివరాలు

ఆర్సీబీతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధం

ఆ మ్యాచ్ అనంతరం ముంబయి జట్టు రాయ్‌పూర్‌కు బయలుదేరినప్పుడు హార్దిక్ జట్టుతో కలిసి ప్రయాణించకపోవడంతో, ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ అతడు ఆడడన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే తాజా పరిణామాలతో హార్దిక్ తిరిగి జట్టులోకి రానున్నాడన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. ఇదిలా ఉండగా, స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలే సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో వెనుకబడిపోయింది. ఇంకా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినా, ప్లే ఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ముంబయికి ఎదురైంది

Advertisement