GT vs LSG: మోహిత్ శర్మ ధాటికి చతికిలపడ్డ లక్నో: భారీ లక్ష్యాన్ని ఛేధించలేక ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో భాగంగా అహమ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జియంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచులో గుజరాత్ చేసిన 228పరుగుల లక్ష్యాన్ని లక్నో సూపర్ జియంట్స్ అందుకోలేకపోయింది. ఫలితంగా గుజరాత్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.
మొదట బ్యాటింగుకు దిగిన గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా 81పరుగులు (43బంతుల్లో 10 ఫోర్లు, 4సిక్సర్లు), శుభ్ మన్ గిల్ 94పరుగులు (51బంతుల్లో 3ఫోర్లు, 7సిక్సర్లు), హార్దిక్ పాండ్యా 25(15బంతుల్లో 1ఫోర్లు, 2సిక్సర్లు), మిల్లర్ 21(12బంతుల్లో 2-హోర్లు, 1సిక్సర్) పరుగులు చేసారు.
20ఓవర్లు ముగిసే సమయానికి 4వికెట్లు కోల్పోయి 227పరుగులు చేసింది గుజరాత్.
లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
Details
బౌలింగ్ తో మాయాజాలం చేసిన మోహిత్ శర్మ
228పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, ఆరంభంలో బాగా ఆడింది. మొదటి వికెట్ కు 88పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. కానీ ఆ తర్వాతే వికెట్లు నష్టపోతూ వచ్చింది.
చివరకు 20ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు కోల్పోయి 171పరుగులు మాత్రమే చేయగలిగింది.
లక్నో బ్యాటర్లలో కైలేస్ మేయర్స్ 48పరుగులు(32బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), క్వింటన్ డికాక్ 70 (41బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), ఆయూష్ బదోనీ 21 (11బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) చేసారు.
గుజరాత్ బౌలర్లో మోహిత్ శర్మ 4వికెట్లు, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.