Gujarat Titans: లావెండర్ జెర్సీల్లో గుజరాత్ టైటాన్స్.. అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తమ సాధారణ నీలం జెర్సీలకు బదులుగా ప్రత్యేక లావెండర్ జెర్సీలతో బరిలోకి దిగింది. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు గుజరాత్ టైటాన్స్ ఈ ప్రత్యేక చర్య చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్లపై అవగాహనకు లావెండర్ రంగును ప్రతీకగా ఉపయోగిస్తారు. క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబాలకు మద్దతు తెలియజేయడానికి గుజరాత్ టైటాన్స్ ఈ కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించింది.
వివరాలు
క్యాన్సర్‌పై పోరాటంలో అందరం ఏకం కావాలి
అప్పటి నుంచి ప్రతి ఏడాది ఒక మ్యాచ్‌లో లావెండర్ జెర్సీలతో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌తో వరుసగా నాలుగో ఏడాది కూడా జట్టు ఈ ప్రత్యేక జెర్సీలను ధరించింది. మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో "ఈ రోజు మ్యాచ్ కంటే పెద్ద లక్ష్యం ఉంది. క్యాన్సర్‌పై పోరాటంలో అందరం ఒక్కటిగా నిలుద్దాం" అంటూ సందేశం పంచుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేవరికి ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.