LOADING...
Hafthor Bjornsson: వెయిట్‌లిఫ్టింగ్‌లో 'హాఫ్థోర్ బ్జోర్న్‌సన్' ప్రపంచ రికార్డు
వెయిట్‌లిఫ్టింగ్‌లో 'హాఫ్థోర్ బ్జోర్న్‌సన్' ప్రపంచ రికార్డు

Hafthor Bjornsson: వెయిట్‌లిఫ్టింగ్‌లో 'హాఫ్థోర్ బ్జోర్న్‌సన్' ప్రపంచ రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌' అభిమానులకు 'ది మౌంటైన్‌'గా గుర్తున్న హాఫ్థోర్ బ్జోర్న్‌సన్ ఇప్పుడు ప్రపంచ రికార్డు కోసం హైలైట్‌లో నిలిచాడు. హాఫ్థోర్, ప్రముఖ వెయిట్ లిఫ్టర్‌గా, 2025 స్ట్రాంగ్‌ మ్యాన్‌ కాంపిటీషన్‌లో ఒకేసారి 510 కిలోల (1,124 పౌండ్లు) బరువును ఎత్తి రికార్డు సృష్టించారు. గతంలో 505 కిలోల రికార్డు తనదే అయినప్పటికీ, ఈసారి అదే ఘనతను తన చేతులు బద్దలు కొట్టాడు. 2018లోనూ అతడు 'స్ట్రాంగ్ మ్యాన్‌'గా గుర్తింపు పొందాడు.

Details

లిఫ్టింగ్‌పై ఎక్కువ దృష్టి

అయితే, 510 కిలోలు ఎత్తినప్పటికీ హాఫ్థోర్ అతని అత్యుత్తమ ప్రదర్శన ఇది కాదని, ఇంకా ఎక్కువ బరువును ఎత్తనని స్పష్టంచేశారు. అభిమానులు 'ఇంత బరువు ఎత్తడం సులభమా? ఇంకా ఎక్కువ బరువును ఎత్తగలవా?' అని అడుగుతారు. నేను నా వ్యూహం ప్రకారమే విజయాన్ని సాధించాను. ఇక అంతకుమించి బరువును ఎత్తను. ఇంకా ఐదు ఈవెంట్లు ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ కోసం నా రోజువారీ ఆహారం, ప్రణాళికలో మార్పు చేయను. పొట్టను హాయిగా ఉంచి, లిఫ్టింగ్‌పై ఎక్కువ దృష్టి పెడతానని హాఫ్థోర్ తెలిపారు.